మల్కాజిగిరిలోని చాణక్యపురి చంద్రగుప్త అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగింది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాషింగ్ మెషిన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, మల్కాజిగిరి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు
