కుక్కలు.. కోతులు దాడి చేయడం సహజంగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో తామేమి తక్కువ తినలేదంటూ పిల్లులు కూడా మనుషులపై దాడి ప్రారంభించాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాపెగడపల్లి మండలం వెంగలాయిపేట జరిగింది.
ఆ పిల్లికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కాని ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. మనుషులపై దాడికి దిగిన పిల్లి ఆరుగురిని గాయపర్చింది. ఈ విషయాన్ని గ్రామస్తులు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. తరువాత ఆ పిల్లిని గ్రామస్తులు చేపలు పెట్టె వల సాయంతో పిల్లిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
