Ravi Shastri: భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించడం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన బాధ్యత అని టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటగాడిగా మైదానంలోకి దిగడం, లేదా మైక్ పట్టుకుని కామెంట్రీ చెప్పడం కంటే.. భారత జట్టుకు కోచ్‌గా ఉండటమే అత్యంత సవాల్‌తో కూడుకున్న పనని ఆయన స్పష్టం చేశారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ స్మిత్‌తో స్కై స్పోర్ట్స్ (Sky Sports) ముఖాముఖిలో మాట్లాడిన రవిశాస్త్రి, ఇండియన్ టీమ్ కోచ్‌గా తన అనుభవాలను, ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడిని పంచుకున్నారు.
కోచ్ చేతుల్లో ఏమీ ఉండదు.. ఒత్తిడే ప్రధాన శత్రువు:
ఆటగాడు, వ్యాఖ్యాత, కోచ్.. ఈ మూడు పాత్రలను పోషించిన రవిశాస్త్రి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. ఒక ఆటగాడిగా బ్యాట్ లేదా బంతితో మ్యాచ్ ఫలితాన్ని మీరు మార్చవచ్చు.. కామెంటేటర్‌గా మైక్ పట్టుకుని పూర్తి స్వేచ్ఛతో మాట్లాడవచ్చు, కానీ ఒక కోచ్‌గా ప్లేయర్లు మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత మీ చేతుల్లో ఏమీ ఉండదు.. కేవలం చూస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేం.. భారత క్రికెట్‌లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే.. ఇక్కడ సాకులు చెప్పడానికి వీల్లేదు.. మీ తలపైన ఎప్పుడూ తుపాకీ పెట్టినట్టే ఉంటుంది (You always have the gun to your head).. ముఖ్యంగా కోవిడ్-19 (COVID-19) లాంటి సమయంలో బయో-బబుల్ వాతావరణంలో ఫలితాలు సాధించడం ఎంతో మానసిక ఒత్తిడితో కూడుకున్న విషయమని అని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నారు.
ఒత్తిడి ఎంత ఉందో.. విజయం ఇచ్చే కిక్ కూడా అంతే:
* ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, టీమిండియాకు కోచ్‌గా సాధించే విజయాలు ఇచ్చే తృప్తి, గౌరవం మరేదానికీ రావని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.
* చారిత్రాత్మక రికార్డులు: రవిశాస్త్రి కోచింగ్ కాలంలోనే (జూలై 2017 – నవంబర్ 2021) భారత్ ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు (2018-19, 2020-21) బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
* నెంబర్-1 సింహాసనం: దాదాపు 42 నెలల పాటు టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగింది.
* వరల్డ్ కప్ సాధన: 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ వరకు జట్టును నడిపించడంలో రవిశాస్త్రి పాత్ర మరచిపోలేనిది.
క్రికెట్ పట్ల ఉన్న ప్రేమతోనే జీవితం సుగమం:
హెడ్ కోచ్ గా పదవి ముగిసిన తర్వాత కూడా క్రికెట్ ప్రసార రంగంలో (Broadcasting) నిలకడగా కొనసాగడానికి తనకున్న అనంతమైన ప్రేమే కారణమని రవిశాస్త్రి తెలిపారు. భారత క్రికెట్‌లో తనకున్న గుర్తింపుతో వేరే ఏ రంగంలోకైనా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, ఆటపై ఉన్న మక్కువతోనే కామెంట్రీ వైపు మళ్లీ వచ్చానని చెప్పారు. బిగ్ ఫైనల్స్, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లకు మైక్ పట్టుకుని ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని శాస్త్రి ముగించారు.
Behind two remarkable captaincy stints were two very different leadership styles. 🌟 Ravi Shastri tells us what set ROKO apart. Watch the HERO VIDA India Tour of New Zealand 3rd ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha and Sony LIV. #SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND
— Sony Sports Network (@SonySportsNetwk) November 10, 2026
