నవంబర్ 19న ఇన్ సర్వీస్  టీచర్లకు స్పెషల్ టెట్

నవంబర్  19న ఇన్ సర్వీస్  టీచర్లకు స్పెషల్ టెట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు టీచర్ల కోసం స్పెషల్ టెట్–2026ని ఈ నెల19న నిర్వహించనున్నారు.  ఈ పరీక్షకు మొత్తం10,586 మంది టీచర్లు అటెండ్ కానున్నారు. అయితే, ఎగ్జామ్‌‌‌‌కు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల12 నుంచి https://schooledu.telangana.gov.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ గాజర్ల రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్‌‌‌‌టికెట్లను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలని సూచించారు. మొదటి సెషన్‌‌‌‌లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పేపర్–-1 పరీక్ష జరగనుంది. దీనికి 2,591 మంది టీచర్ల అటెండ్ కానున్నారు. రెండో సెషన్‌‌‌‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్–-2 పరీక్ష కొనసాగనుంది. దీనికి అత్యధికంగా 7,995 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.