ముషీరాబాద్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ మృతి..రాంగ్ రూట్ లో వచ్చిన టూ వీలర్

ముషీరాబాద్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ మృతి..రాంగ్ రూట్ లో వచ్చిన టూ వీలర్
  •     తప్పించబోయి కిందపడ్డ తండ్రీ కూతుళ్లు 
  •     బస్సు చక్రాల కింద నలిగి బిడ్డ కన్నుమూత 

ముషీరాబాద్, వెలుగు : రోడ్డు ప్రమాదంలో ఓయూలో  బీఈ మైనింగ్ చదువుతున్న విద్యార్థిని చనిపోయింది. నల్లకుంట సీఐ మారుతి ప్రసాద్ కథనం ప్రకారం..షేక్ ఆరిఫ్ తన కుటుంబంతో మెహిదీపట్నంలోని విజయపురి కాలనీలో ఉంటున్నారు. ఈయన కూతురు షేక్ ఆయేషా ముస్ఫిర్  (21) ఓయూ మైనింగ్ కాలేజీలో చదువుకుంటోంది. సోమవారం ఉదయం తన తండ్రితో కలిసి టూవీలర్​పై కాలేజీకి వెళ్తోంది. 

9 గంటల ప్రాంతంలో  ఫీవర్ హాస్పిటల్ సమీపంలో ఆపోజిట్ రాంగ్ రూట్​లో వచ్చిన ఓ టూవీలర్​ ను తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు. అదే టైంలో బర్కత్​పురా నుంచి కుషాయిగూడ వెళ్తున్న బర్కత్​పురా డిపో బస్సు షేక్ ఆయేషా మీది నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. ఆరిఫ్​పక్కకు పడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డాడు. రాంగ్ రూట్​లో వచ్చిన ధర్మరాజు, ఆర్టీసీ డ్రైవర్ బాబు ను నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.