హామిల్టన్: టీమిండియా వైట్‌బాల్ పేసర్లు అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌లోనే ఉండనున్నారు. కివీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో వీళ్లు టీమిండియాకు సాయం చేయనున్నారు. మూడో వన్డే ముగిసిన తర్వాత శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ అన్షుల్ కాంబోజ్ వెల్లింగ్టన్కు పయనం కానున్నారు.
ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక క్యాంప్‌లో పాల్గొని టెస్ట్ సన్నాహకాలను ప్రారంభించనున్నారు. ఈ క్యాంప్ ద్వారా టీమిండియాకు ఐదు లేదా ఆరు ప్రాక్టీస్ సెషన్లు లభిస్తాయి. దీనివల్ల టీమ్ సన్నద్ధత మెరుగుపడుతుందని అసిస్టెంట్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు. టెస్ట్ సిరీస్ కోసం కోచింగ్ సిబ్బంది కూడా రెండు జట్లుగా విడిపోనున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్ సాయిరాజ్ బహుతులే చివరి రెండు వన్డేలకు టీమ్‌తో పాటు ఉంటారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో పాటు ఇతర సిబ్బంది టెస్ట్ టీమ్‌తో పాటు వెల్లింగ్టన్కు వెళ్తారు.
