రావల్పిండి: శ్రీలంకతో సోమవారం మొదలైన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ నిలకడగా ఆడుతోంది. తయ్యబ్ ఆరిఫ్ (57), మహ్మద్ తాహ (51), బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (57 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయడంతో.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 67.2 ఓవర్లలో 281/5 స్కోరు చేసింది. అజాన్ ఆవైస్ (30) మోస్తరుగా ఆడినా.. సల్మాన్ ఆగా (16) నిరాశపర్చాడు. అసితా ఫెర్నాండో 2, దిల్షాన్ మధుషనక, మిలాన్ రత్నాయకే, సోనల్ దినుషా తలా వికెట్ తీశారు.
