ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడాకులు తీసుకున్నారు. భార్య అన్నా లెజినోవాతో విడిపోతున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. ఇంత వరకు ఓకే.. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. జనసేన పార్టీలో కోట రుక్మిణి ఎవరు అని.. జనసేన పార్టీలో కోట రుక్మిణి పాత్ర ఏంటీ.. ఆమె ఏం చేస్తుంటారు అనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. ఇంతకీ జనసేన పార్టీలో కోట రుక్మిణి ఏం చేస్తుంటారు అనే దానికి.. సోషల్ మీడియాలోనే పలు రకాలుగా సమాధానాలు వస్తున్నాయి. ఆమె గురించి చర్చల్లో వస్తున్న కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సెక్రటేరియట్ లో కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో ఆ కేబినెట్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆ సమయంలో కోట రుక్మిణి ఏపీ సెక్రటేరియట్ కు వచ్చారు. అప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె గురించి పలు రకాలుగా చర్చించుకోవటం కనిపిస్తుంది. ఇప్పుడు వపన్ కల్యాణ్ విడాకులు ఇచ్చిన తర్వాత.. మళ్లీ కోట రుక్మిణి సోషల్ మీడియాలో హైటెట్ కావటం.. ఆమె గురించి చర్చించుకోవటం జరుగుతుంది.
ఎవరీ కోట రుక్మిణి..?
కోట రుక్మిణి స్వస్థలం.. కృష్ణా జిల్లా. ఆమె 2022 వరకూ లండన్లో ప్రముఖ బ్రాండెడ్ షాప్ నిర్వహించేవారు. ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనకు కావాల్సినవన్నీ రుక్మిణినే కల్పించేదని టాక్. 2020లో రుక్మిణిని జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక.. తన నివాసాన్ని లండన్ నుంచి హైదరాబాద్కు మార్చారు. అప్పటినుంచి ఆమె జనసేన పార్టీలో కీలకంగా మారారని వినికిడి.
వాస్తవానికి నాదెండ్ల మనోహర్ చెప్పిన మాటను జనసేన అధినేత కాదనరాని జనసేన నాయకుల్లో టాక్. అలాంటిది ఆయనకంటే కంటే కోట రుక్మిణి చాలా పవర్ఫుల్ అన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. పవన్ విడాకుల తర్వాత ఇపుడు సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు,ఆమె గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది.
