విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రెజీనా కసాండ్రా మరో ఆసక్తికరమైన సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు చెందిన జీ స్వ్కాడ్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి ‘ఆర్‌ఎక్స్’ అనే డిఫరెంట్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఇందులో రెజీనా ప్రధాన పాత్ర పోషిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
‘ట్రూత్ ఆల్వేస్ డిమాండ్స్ ఎ వాయిస్’ (సత్యానికి ఎల్లప్పుడూ ఒక స్వరం అవసరం) అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన పోస్టర్‌లో రద్దీగా ఉన్న రైలులో కనిపిస్తోంది రెజీనా. ఆమె సీరియస్ లుక్, పోస్టర్‌పై ఉన్న ఈసీజీ తరహా గీతలు సినిమా కథపై ఉత్కంఠను పెంచుతున్నాయి. విశాల్ వెంకట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నాజర్, రమేష్ తిలక్, శ్రీజ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. చెన్నైలో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.
