సీనియర్ నటులు జి.వి. నారాయణరావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ముఖ్యపాత్రల్లో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. పి.ఎస్.జె ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించారు. దీపావళి సందర్భంగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. వృద్దాశ్రమంలో వందలాదిమంది సీనియర్ సిటిజన్స్ సమక్షంలో రిలీజ్ డేట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
నవంబర్ 27న సినిమా విడుదల కాబోతున్నట్టు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ నటి జయలలిత మాట్లాడుతూ ‘ఇందులో అంధుడైన వయోలిన్ మాస్టర్‌గా మహర్షి గారు నటించగా, ఆయనకు భార్యగా సంగీతం టీచర్ శ్యామల పాత్రను పోషించాను. ఓ నటిగా ఈ చిత్రం ఎంతో సంతృప్తినిచ్చింది’ అని చెప్పారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ చుట్టూ జరిగే ఈ కథ ఎంతో హార్ట్ టచింగ్‌గా, ఆలోచింపజేసేలా ఉంటుందని, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గొప్పగా ఉంటుందని దర్శకనిర్మాతలు తెలియజేశారు.
