అనన్య పాండేకు ఈ ఏడాది దీపావళి చాలా స్పెషల్.. కారణం ఏంటో చెప్పని బ్యూటీ!

అనన్య పాండేకు ఈ ఏడాది దీపావళి చాలా స్పెషల్.. కారణం ఏంటో చెప్పని బ్యూటీ!

‘లైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌ అనన్య పాండే.. సక్సెస్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్యూర్స్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగిస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉండే అనన్య.. ఫ్యాషన్, ట్రెండీ ఫోటోషూట్స్‌‌‌‌‌‌‌‌తో ఎప్పటికప్పుడు అభిమానులను ఎంగేజ్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటుంది. తన సోషల్ మీడియా పోస్టులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీపావళి సందర్భంగా వైబ్రెంట్‌‌‌‌‌‌‌‌ రెడ్ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌‌‌‌‌లో ఇలా కలర్​పుల్‌‌‌‌‌‌‌‌గా కనిపించి అభిమానులను ఫిదా చేసింది.  

ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీతో ఆమె రాయల్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌ మెరిసిపోయిందంటూ నెటిజన్స్‌‌‌‌‌‌‌‌ ప్రశంసలు కురిపించారు.  ‘ఇవి చాలా పద్ధతిగా ఉన్న ఫోటోస్‌‌‌‌‌‌‌‌ అని నాకు తెలుసు.  నిజం చెప్పాలంటే ఈ ఏడాది దీపావళిని నా జీవితంలోనే అత్యంత ఆనందంగా జరుపుకున్నా’ అని క్యాప్షన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది అనన్య పాండే. ఆ ఆనందానికి గల కారణమేంటో మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ ఏడాది ఆమె నటించిన ‘చాంద్ మేరా దిల్‌‌‌‌‌‌‌‌’ చిత్రం  ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.  మరోవైపు అక్షయ్ కుమార్ కొడుకు ఆరవ్ భాటియాతో అనన్య డేటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఇద్దరూ తమ రిలేషన్‌‌‌‌‌‌‌‌ గురించి ఎక్కడా రియాక్ట్ అవలేదు.