శోభిత ధూళిపాళ్ల ‘వేట్టువం’ నుంచి పవర్‌ ఫుల్ వీడియో రిలీజ్.. సంక్రాంతికి పాన్ ఇండియా విడుదల!

శోభిత ధూళిపాళ్ల ‘వేట్టువం’ నుంచి పవర్‌ ఫుల్ వీడియో రిలీజ్.. సంక్రాంతికి పాన్ ఇండియా విడుదల!

శోభిత ధూళిపాళ్ల నటిస్తున్న తమిళ చిత్రం ‘వేట్టువం’.  పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శోభిత, ఆర్య లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘సెలబ్రేట్ రెసిలియన్స్’ పేరుతో  ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్.  ప్రతికూల పరిస్థితుల్లో పాత్రలు చూపించే సహనం, ధైర్యం, పోరాట పటిమను ఈ వీడియోలో ఆసక్తికరంగా చూపించారు. 

విభిన్న సమూహాల మధ్య సంఘర్షణలు, అనూహ్య పరిణామాలు, పోరాటాల నేపథ్యంలో పా. రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఈ వీడియో ద్వారా రివీల్ చేశారు.  వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరసన్, మైమ్ గోపి  కీలక పాత్రలు పోషిస్తున్నారు.   ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా. రంజిత్ కలిసి  నిర్మిస్తున్నారు.  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతికి పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  సినిమా విడుదల కానుంది.