బాలయ్య అభిమానులకు దాదా ధమాకా.. నవంబర్ 13న తొలి పాట రిలీజ్!

బాలయ్య అభిమానులకు దాదా ధమాకా.. నవంబర్ 13న తొలి పాట రిలీజ్!

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో ‘వీర సింహారెడ్డి’ తర్వాత తెరకెక్కుతోన్న చిత్రం ‘దాదా’. వృద్ధి  సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్​ కిలారు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ అందించారు మేకర్స్. ‘దాదా ధమాకా’ స్టార్ట్ అంటూ నవంబర్ 13న ఈ  చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఈ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బాలకృష్ణ,  బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కనిపించారు.  చేతిలో గన్,  లెదర్ జాకెట్, సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్లాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాలయ్య  స్టైలిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇంప్రెస్ చేస్తున్నారు. 

తమన్ కంపోజ్ చేసిన ఈ ఫస్ట్ సింగిల్ అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వనుందని మేకర్స్ తెలియజేశారు.  ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌‌‌‌‌గా  నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్  రాశారు. రామ్-లక్ష్మణ్, రవివర్మ, వి. వెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కంపోజ్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా  డిసెంబర్ 24న వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినిమాను విడుదల చేయనున్నారు.