కోహ్లీకి ఫోన్ చేశా.. ఆ రాత్రే రిటైర్మెంట్ఇచ్చేశా.. కేన్ విలియమ్సన్ షాకింగ్ కామెంట్స్

కోహ్లీకి ఫోన్ చేశా.. ఆ రాత్రే రిటైర్మెంట్ఇచ్చేశా.. కేన్ విలియమ్సన్ షాకింగ్ కామెంట్స్

Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే దిగ్గజ ఆటగాళ్లుగా, స్నేహితులుగా నిలిచిన ఇద్దరు వ్యక్తులు విరాట్ కోహ్లీ (Virat Kohli), కేన్ విలియమ్సన్ (Kane Williamson). మైదానంలో ప్రత్యర్థులుగా ఢీకొట్టినప్పటికీ, సరిహద్దులు దాటిన వీరి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, తాజాగా తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక విరాట్ కోహ్లీతో జరిపిన ఒకే ఒక్క ఫోన్ కాదే అత్యంత కీలకమైందని విలియమ్సన్ బయటపెట్టడం ప్రపంచ క్రికెట్‌లో సంచలనంగా మారింది. 

కోహ్లీతో మాట్లాడాకే రిటైర్మెంట్: 

ప్రసిద్ధ బిట్వీన్ ది టూ బీర్స్ (Between the Two Beers) పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కేన్ విలియమ్సన్.. రిటైర్మెంట్ ప్రకటన చేయడానికి సరిగ్గా ఒక రోజు ముందు విరాట్ కోహ్లీతో జరిపిన సీక్రెట్ డిస్కషన్ గురించి నోరువిప్పారు.. రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకునే ముందు నాకెంతో నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడాను.. ఆ క్రమంలోనే ప్రకటనకు ఒక రోజు ముందు కోహ్లీకి కూడా ఫోన్ చేశాను.. అతనితో మాట్లాడుతున్నంత సేపు నన్ను నేను అద్దంలో చూసుకున్న అనుభూతి కలిగింది. క్రికెట్‌లో మేమిద్దరం ఫేస్ చేసిన ఒత్తిడి, కెప్టెన్సీ భారం, ఒకే సమయంలో మాకు పిల్లలు కలగడం.. మా జీవిత ప్రయాణాలు రెండూఈక్వెల్ గా ఉన్నాయి.. ఆ ఫోన్ కాల్ ముగియగానే నా భార్య రూమ్‌లోకి వచ్చింది.. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక నేను రిటైర్మెంట్ ప్రకటించే సమయం వచ్చింది అని చెప్పేశానని కేన్ మామ వెల్లడించాడు.  

10 వేల పరుగుల మైలురాయి కోసం నేను ఆడలేదు: 

తన జట్టు సహచరులకు కూడా చెప్పుకోలేని మనసులోని ఎమోషన్స్‌ను.. సరిగ్గా తనలాంటి పరిస్థితులనే అనుభవించిన విరాట్ కోహ్లీతో ఎలాంటి సంకోచం లేకుండా పంచుకోగలిగానని కేన్ మామ చెప్పుకొచ్చాడు. ఇక, టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగుల మైలురాయిని అందుకోలేకపోయినందుకు విలియమ్సన్ ఏమాత్రం బాధపడటం లేదన్నాడు. రికార్డులు, సెంచరీలు లేదా బ్యాటింగ్ యావరేజ్ చూసి క్రికెట్ ఆడలేదని కేన్ స్పష్టం చేశాడు. ఆటపై సహజసిద్ధమైన ఆసక్తి తగ్గిపోతున్నప్పుడు, కేవలం రికార్డుల కోసమో లేదా ఇతరుల కోసమో ఆడుతున్నామనే భావన వస్తే తప్పుకోవడమే సరైనదని కింగ్ కోహ్లీతో జరిపిన చర్చ తనకు పూర్తి క్లారిటీ ఇచ్చిందని చెప్పాడు.