కర్ణాటకలో ఇథనాల్ 20 శాతం దాటలేదు: ట్వీట్ డిలీట్ చేసిన భారత్ పెట్రోలియంపై ట్రోలింగ్

కర్ణాటకలో ఇథనాల్ 20 శాతం దాటలేదు: ట్వీట్ డిలీట్ చేసిన భారత్ పెట్రోలియంపై ట్రోలింగ్

సోషల్ మీడియాలో భారత్ పెట్రోలియంపై లెట్ ద ఫ్యాక్ట్స్ స్పీక్ (Let the Facts Speak) అనే క్యాంపెయిన్ నడుస్తోంది. కర్ణాటక ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ ను డిలీట్ చేయడంతో ఈ క్యాంపెయిన్ నడుస్తోంది. 

పెట్రోల్, డీజిల్ లో ఇథనాల్ బ్లెండింగ్ 20 కాదు.. 33 శాతం వరకు ఉందని కర్ణాటక ప్రభుత్వం పరీక్షల తర్వాత అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ ఇస్తూ.. మైసూరులో పరీక్షించగా 20 శాతం మించలేదని.. నిబంధనల మేరకే బ్లెండింగ్ ఉన్నట్లు 2026 నవంబర్ 8 (ఆదివారం) ట్వీట్ చేసింది.  

అయితే చాలా మంది ఇథనాల్ టెస్టుకు సంబంధించిన వీడియోలు ఆధారాలతో సహా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. 20 కాదు 33 శాతం వరకు వస్తోందని రీడిండ్  చూపిస్తూ షేర్ చేశారు. బీపీసీఎల్ తప్పుదోవ పట్టించాలని చూస్తోందని విమర్శించారు. దీంతో ట్వీట్ డిలీట్ చేసింది భారత్ పెట్రోలియం శాఖ. 

చాలా మంది యూజర్లు బీపీసీఎల్ డిలీట్ చేసిన ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత్ పెట్రోలియం సంస్థ దోపిడీకి పాల్పడుతోందంటూ కామెంట్స్ చేశారు. 

మరోవైపు ఈ20 పెట్రోల్ లో ఇథనాల్ శాతం 30 మించుతోందని కర్ణాటక ప్రభుత్వం టెస్టు చేసి బయటపెట్టింది. ఇండియన్ ఆయిల్, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ లకు సంబంధించి మొత్తం 63 శాంపుల్స్ సేకరించగా అందులో ఇథనాల్ శాతం ప్రభుత్వం చెప్పే లిమిట్స్ ఎప్పుడో దాటిందని పేర్కొంది. దీంతో అది తప్పు అని చెప్పేందుకు చేసిన ట్వీట్ మళ్లీ బీపీసీఎల్ కు ఎదురు తగలటంతో ట్వీట్ డిలీట్ చేసింది. 

మరిన్ని వార్తలు