సినీ స్టార్స్ అంటేనే గ్లామర్.. ఖరీదైన దుస్తులు.. ప్రత్యేకమైన లొకేషన్లు.. కెమెరాల ముందు అందమైన పోజులు! ముఖ్యంగా మెటర్నిటీ ఫొటోషూట్ అంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం ప్రత్యేకంగా డిజైనర్ దుస్తులు, భారీ సెటప్‌లు, కళ్లు చెదిరే ఫొటోషూట్లు కనిపిస్తుంటాయి. కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆలోచించారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సాధారణంగా బేబీ బంప్‌తో ఓ ఫొటో షేర్ చేసి అభిమానుల మనసు గెలుచుకున్నారు. అంతేకాదు.. ఆ ఫొటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇదే నా మెటర్నిటీ ఫొటోషూట్: సమంత
సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ అందమైన ఫొటోను షేర్ చేశారు. అందులో ఆమె ఎంతో రిలాక్స్డ్గా సోఫాపై కూర్చొని కనిపించారు. ఎరుపు రంగు టాప్, తెల్లటి ట్రౌజర్, నల్లటి సన్‌గ్లాసెస్‌తో చాలా క్యాజువల్ లుక్‌లో ఉన్న సమంత.. తన బేబీ బంప్‌పై ప్రేమగా చేయి ఉంచి ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటోకు 'Consider this my maternity shoot' (దీన్నే నా మెటర్నిటీ ఫొటోషూట్‌గా భావించండి) అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. సాధారణంగా సెలబ్రిటీలు మెటర్నిటీ ఫొటోషూట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటుంటే.. సమంత మాత్రం తన సహజమైన లుక్‌తోనే ఈ ప్రత్యేకమైన క్షణాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కూలెస్ట్ మమ్మీ టు బీ'.. అభిమానుల ప్రేమ!
సమంత షేర్ చేసిన ఈ ఫొటోపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'కూలెస్ట్ మమ్మీ టు బీ ఎవర్!' అంటూ ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'ప్లాట్ ట్విస్ట్.. బేబీ అప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది' అంటూ మరో నెటిజన్ సరదాగా స్పందించారు. 'జూనియర్ సమంత కోసం ఎదురుచూస్తున్నాం' అంటూ ఇంకొందరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఎలాంటి ప్రత్యేకమైన ఫొటోషూట్ లేకపోయినా, ఒక సాధారణ ఫొటోతోనే సమంత అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె సింప్లిసిటీనే ఈ పోస్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుక..
సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇటీవల ఈ జంట ఈషా ఫౌండేషన్‌లో సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సమంత పలు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముఖ్యంగా రాజ్ ఆమెపై ముత్యాలను కురిపిస్తున్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంది. శ్రీ విద్య సంప్రదాయంలోని 'కళా ఆవరణ' ఆచారానికి సంబంధించిన విశేషాలను కూడా సమంత గతంలో వివరించారు.
డిసెంబర్లో బుల్లి అతిథి రాక..!
సమంత, రాజ్ నిడిమోరు దంపతుల జీవితంలోకి త్వరలోనే మరో కొత్త ఆనందం రాబోతోంది. ఈ జంట తమ మొదటి బిడ్డకు డిసెంబర్ 2026 ఫస్ట్ వీక్ లో స్వాగతం పలకనున్నట్లు తెలుస్తోంది. అయితే డెలివరీకి సంబంధించి కచ్చితమైన తేదీని మాత్రం సమంత ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. దీంతో సమంత అభిమానులు జూనియర్ సమంత రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తన జీవితంలోని ఈ ప్రత్యేకమైన క్షణాలను ఆస్వాదిస్తూ, మాతృత్వానికి సిద్ధమవుతున్నారు ఈ స్టార్ హీరోయిన్.
