సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దూరంగా ఉండాలని iTDP స్పష్టం చేసింది. కూటమి పార్టీల నాయకులతో పాటు వైసీపీ నేతల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడాన్ని ఆమోదించబోమని తెలిపింది. iTDPకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా ఖాతాల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలకు, ఇతరులను కించపరిచే వ్యాఖ్యలకు సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా విడాకుల వ్యవహారంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న వేళ టీడీపీ ఈ ప్రకటన వెలువరించింది. ఈ వ్యవహారం ఆధారంగా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై స్పందిస్తూ.. వైసీపీ సహా ఇతర పార్టీల నాయకులపై వ్యక్తిగత దూషణలు, విమర్శలకు దిగరాదని స్పష్టం చేసింది.
అదే విధంగా ఎవరైనా వ్యక్తిగతంగా చేసే కామెంట్స్, రీమార్క్స్ తో పార్టీతో సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది. గౌరవం ఇస్తూనే బాధ్యతయుతంగా మెలగాలని పేర్కొంది.
ALSO READ : పెళ్లిళ్లు, విడాకులపై వ్యక్తిగత విమర్శలు, కామెంట్స్ చేయొద్దు
Dignity in public discourse is non-negotiable.. iTDP will not tolerate personal attacks on anyone, from any side.. Service to the Telugu people is the only conversation that matters.. #iTDP #RespectRestraintResponsibility https://t.co/a2TkFn4l4S
— iTDP Official (@iTDP_Official) November 9, 2026
మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యవహారంపై ఇప్పటికే వైసీపీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. పార్టీ శ్రేణులు వ్యక్తిగత దూషణలకు, విమర్శలకు దూరంగా ఉండాలని నాలుగు పాయింట్లతో కూడిన ప్రకటనను విడుదల చేసిన కాసేపటికే టీడీపీ ప్రకటన వెలువరించడం గమనార్హం.
