Renu Desai : రాత్రి 11 గంటలు దాటినా ఇదేంపని.. దీపావళి టపాసులపై రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్!

Renu Desai : రాత్రి 11 గంటలు దాటినా ఇదేంపని.. దీపావళి టపాసులపై  రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్!

పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. నటిగానే కాకుండా జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడించే వ్యక్తిగా ఆమెకు గుర్తింపు ఉంది.
అయితే దీపావళి పండగ పేరుతో అర్ధరాత్రి దాటినా భారీ శబ్దాలతో బాణసంచా కాల్చడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  లేటెస్ట్ గా ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

రాత్రి 11 గంటలు దాటినా పెద్ద పెద్ద శబ్దాలతో టపాసులు కాలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి రోజే ఇలాంటి విషయాలపై మాట్లాడితే తనను హిందూ వ్యతిరేకి అని ముద్ర వేస్తారని, అందుకే ఆరోజు మౌనంగా ఉన్నానని వెల్లడించారు. అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు బాణసంచా కాల్చడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారి పరిస్థితిని ఒక్కసారి ఆలోచించాలని కోరారు. మన ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం మూర్ఖత్వమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీపాల పండుగను ఆనందంగా జరుపుకోండి. కానీ దాన్ని శబ్దాల పోటీగా మార్చకండి. వీలైనంత వరకు రాత్రి 10 గంటల్లోపే టపాసులు కాల్చడం ముగించండి. మీ ఆనందం కోసం ఇతరులను హింసించకండి. తోటి మనుషుల పట్ల కొంచెం దయ చూపించండి అంటూ హితవు పలికారు.

అంతేకాదు, కాలుష్యం గురించి ఒక్క దీపావళినే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, ఏడాదిలో మిగిలిన రోజుల్లో వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని కూడా గుర్తించాలని పేర్కొన్నారు. దీంతో రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. పండుగ ఆనందం ఇతరుల ప్రశాంతతను దెబ్బతీయకూడదనే ఆమె సందేశానికి నెటిజన్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)