ఇరాన్‌‌‌‌తో మళ్లీ  యుద్ధం ఉండకపోవచ్చు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌‌‌‌తో మళ్లీ  యుద్ధం ఉండకపోవచ్చు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
  • సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యలు
  • బలమైన ఒప్పందంపై సంతకం చేయాల్సిందే
  • 301% ద్రవ్యోల్బణంతో ఇరాన్ కుదేలైంది
  • మిడ్‌‌‌‌టర్మ్ ఫలితాలతో చర్చలకు బ్రేక్: అరాఘ్చీ


వాషింగ్టన్: భవిష్యత్తులో ఇరాన్‌‌‌‌‌‌‌‌తో మళ్లీ యుద్ధం జరిగే అవకాశం చాలా తక్కువని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌తో శాంతి చర్చలు సజావుగా సాగుతున్నంత కాలం మళ్లీ వార్ ఉండకపోవడానికే ఎక్కువ చాన్సెస్ ఉన్నాయని తేల్చిచెప్పారు. సీఎన్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మిడ్ టెర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్‌‌‌‌‌‌‌‌పై దాడులు మళ్లీ ప్రారంభం కావచ్చని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌పై అమెరికా ఇప్పటికే చాలా స్ట్రాంగ్ దాడులు చేసిందని.. మళ్లీ దాడి చేయాల్సిన అవసరం రాకపోవచ్చని తెలిపారు. అయితే, ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకం చేస్తుందా లేదా అనే దానిపైనే భవిష్యత్తు పరిణామాలు ఆధారపడి ఉంటాయని హెచ్చరించారు.

ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఏకంగా 301 శాతానికి చేరిందని ట్రంప్ గుర్తుచేశారు. ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగానే ఇరాన్ నాయకులు అమెరికా షరతులకు తలవొగ్గి శాంతి ఒప్పందాన్ని అంగీకరించక తప్పదని ధీమా వ్యక్తం చేశారు. తాము ఆ దేశాన్ని సైనికపరంగా తీవ్రంగా దెబ్బతీశామని, కావాలనుకుంటే పూర్తిగా అణచివేయగలమని ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు, అమెరికాలో జరిగిన మధ్యకాలిక ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించిన పరిణామాలను ఇరాన్ పరిశీలిస్తోంది. అమెరికా ఎన్నికల ఫలితాలు తమకు పెద్ద షాక్ ఇచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పేర్కొన్నారు. ఈ రాజకీయ పరిణామాల కారణంగానే గత కొన్ని రోజులుగా శాంతి చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు