ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం సినీ, రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమ 13 ఏళ్ల వైవాహిక జీవిత బంధానికి ముగింపు పలుకుతున్నట్లు పవన్ , ఆయన భార్య అన్నా లెజినోవా సంయుక్తంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఆమె మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు. విడిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే తన ఇన్ స్టాగ్రామ్ ను ఖాతాను డీయాక్టివేట్ చేశారు.
సోమవారం రాత్రి 11 గంటలకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తమ నిర్ణయం పరస్పర అవగాహన, గౌరవంతో తీసుకున్నదని పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా వెల్లడించారు. తమ వైవాహిక బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని, పిల్లలకు అంకితభావం కలిగిన తల్లిదండ్రులుగా ఉంటామని స్పష్టం చేశారు. పిల్లల సంతోషం, భవిష్యత్తు తమ ఇద్దరికీ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ వ్యక్తిగత పరిణామంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులను, ప్రజలను కోరారు
►ALSO READ | Renu Desai : 'కిందపడ్డొళ్లను ఇంకా తొక్కొద్దు'.. పవన్, అన్నా లెజినోవా విడాకుల వేళ రేణు దేశాయ్ సంచలన పోస్ట్!
గతంలో అన్నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చినప్పుడు పవన్ కల్యాణే స్వయంగా భార్య అన్నా లెజినోవాకు స్వాగతం పలికారు. ఆమె సోషల్ మీడియా ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆకాంక్షించారు. పలు సందర్భాల్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉన్నారు. అయితే విడిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ డీయాక్టివేట్ చేశారు. దీంతో వీరి విడాకుల ప్రకటనతో పాటు ఇన్ స్టాగ్రామ్ డీయాక్టివేట్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె ఖాతాను ఎందుకు డీయాక్టివేట్ చేశారనే విషయంపై ఎలాంటి అధికారిక వివరణ లేదు.
పవన్ కల్యాణ్‌కు ఇది మూడో వివాహం. గతంలో నందిని, అనంతరం నటి రేణు దేశాయ్‌లతో ఆయన వైవాహిక బంధాలు ముగిశాయి. రేణు దేశాయ్‌తో ఆయనకు అకిరా నందన్, ఆధ్య సంతానం. అన్నా లెజినోవాతో పవన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు విడాకుల ప్రకటన, ఆ వెంటనే అన్నా ఇన్‌స్టాగ్రామ్‌కు దూరం కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
