ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు! ముఖ్యంగా ఒకే ప్రదేశంలో కథ మొత్తం నడుస్తూ.. ప్రతి సన్నివేశం తర్వాత ఏం జరగబోతోందన్న ఉత్కంఠను కలిగించే సినిమాలంటే ప్రేక్షకులకు ప్రత్యేక ఆసక్తి. అలాంటి థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇప్పుడు ఒక మలయాళ మూవీ మంచి ఆప్షన్‌గా మారింది. అదే 'ICU: Until The Last Breath'. హాస్పిటల్ నేపథ్యంలో సాగే ఈ సినిమా నవంబర్ 6 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమ్ అవుతూ ఎంగేజ్ చేస్తుంది.. కేవలం 1 గంట 51 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో సస్పెన్స్, ఊహించని పరిణామాలు, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. జార్జ్ వర్గీస్ డైరెక్ట్ చేయగా బిబిన్ జార్జ్, బాబూరాజ్, మురళీ గోపి, మీరా వాసుదేవ్, శ్రీకాంత్ మురళి కీలక పాత్రలో నటించారు.
ICU: Until The Last Breath' సినిమా కథ:
మలయాళంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ప్రధానంగా ఓ హాస్పిటల్‌లోని ఐసీయూ చుట్టూ తిరుగుతుంది. ఓ యువకుడి ప్రేమ, దానికి సంబంధించిన విభేదాలు, మరో వ్యక్తి బలమైన భావోద్వేగాలు.. ఇలా మొదలైన సంఘర్షణలు చివరకు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ఓ హాస్పిటల్‌లో ఒకే సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక దాడి, అనుకోని కుటుంబ అత్యవసర పరిస్థితి కథను కీలక మలుపు తిప్పుతాయి. ఈ క్రమంలో గతంలో శత్రువులుగా ఉన్నవారు, ప్రేమబంధాలతో ముడిపడిన వ్యక్తులు ఒకే చోటికి చేరుకుంటారు. మరోవైపు ఆసుపత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న అనుమానాస్పద మరణాలు మరింత ఉత్కంఠను పెంచుతాయి.
అసలు ఈ మరణాల వెనుక ఉన్నది ఎవరు? ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? వైద్య సిబ్బందిలో ఎవరికైనా ఈ ఘటనలతో సంబంధం ఉందా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఒక్కొక్కటిగా బయటపడే రహస్యాలు, ఊహించని పరిణామాలు కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తాయి. ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసే ప్రయత్నాలతో పాటు వ్యక్తిగత కక్షలు, ప్రేమ, భయం, అనుమానాలు కథలో కీలకంగా నిలుస్తాయి. మొత్తంగా ప్రేమ, అబ్సెషన్, మిస్టరీ, హాస్పిటల్ డ్రామా కలగలిపిన ఈ సినిమా చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది.
#ICU (Malayalam) Streaming from November 6 on Sunnxt 🍿!! #OTT_Trackers https://t.co/7FRFao2rhh
— OTT Trackers (@OTT_Trackers) November 3, 2026
విశ్లేషణ:
హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని ప్రేమ, పగ, మిస్టరీ, ఎమోషన్స్‌ను కలిపి తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఐసీయూలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలు, అనుమానాస్పద మరణాలు, పాత్రల మధ్య ఉండే పాత సంబంధాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా చివరి వరకు అసలేం జరుగుతోందనే ఉత్కంఠను కొనసాగించేలా కథనం సాగుతుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఒకసారి ఈ సినిమా వైపు లుక్కేయొచ్చు.
