హైదరాబాద్ సిటీకి వాటర్ ప్రాబ్లం వస్తుందా..? వాటర్ బోర్డ్ ఎండీ ఏం చెప్పారంటే.. మరో 40 నుంచి 45 రోజుల వరకు..

హైదరాబాద్ సిటీకి వాటర్ ప్రాబ్లం వస్తుందా..? వాటర్ బోర్డ్ ఎండీ ఏం చెప్పారంటే.. మరో 40 నుంచి 45 రోజుల వరకు..

వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి V6కు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరో 40 నుంచి 45 రోజుల వరకు మంజీరా, సింగూరు జలాలు నగరానికి వస్తాయని ఆయన చెప్పారు. సింగూరు మంజీరా జలాలు ఆగిపోతే నగరానికి 100MGDల నీటి గ్యాప్ ఉంటుందని, ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ప్రత్యామ్నాయంగా గోదావరి నుంచి 40 MGD, కృష్ణా నుంచి 15 MGD, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి 5 ఎంజీడీల నీటిని తీసుకురాబోతున్నామని ఆయన చెప్పారు.

నవంబర్ 15 వరకు గోదావరి నుంచి 40MGDల అదనపు జలాలు హైదరాబాద్కి వస్తాయని తెలిపారు. కూకట్ పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, పటాన్ చెరువుతో పాటు వెస్ట్ సిటీకి గోదావరి అదనపు జలాలను సప్లై చేస్తామని వాటర్ బోర్డ్ ఎండీ వివరించారు. వెస్ట్ సిటీలో 3 లక్షల నీటి కనెక్షన్లకు ప్రస్తుతం సింగూరు జలాలు అందిస్తున్నామని, నగరంలో ప్రతీ ఇంట్లో 20 శాతం నీటిని పొదుపు చేస్తే నీటి సమస్యే ఉండదని తెలిపారు.

సోషల్ మీడియాలో హైదరాబాద్ లో 80 శాతం ప్రాంతాలకు నీళ్లు బంద్ అవుతాయని దుష్ప్రచారం చేస్తున్నారని, తాము ఎవ్వరికి ఎక్కడా నీళ్లు ఆపడం లేదని ఆయన చెప్పారు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుందని ఇల్లీగల్ బోర్ వెల్స్, ప్రైవేట్ ట్యాంకర్ల పై హైడ్రా చర్యలు తీసుకోవడంతో ప్రైవేట్ హాస్టల్స్లో నీటి సమస్య వచ్చిందని, అంతేకానీ నగరంలో ఎక్కడా నీటి కొరత గానీ, నీటి సమస్య కానీ ప్రస్తుతానికి లేదని వాటర్ బోర్డ్ ఎండీ స్పష్టం చేశారు.

డొమెస్టిక్ అవసరాలకు ఉపయోగించే ట్యాంకర్లను ఆపొద్దని సీఎం చెప్పారని, ప్రైవేట్ ట్యాంకర్లు కమర్షియల్ అవసరాలకు వాడితే చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. గార్డెనింగ్ ల్యాండ్ స్కేపింగ్తో పాటు ఇతర అవసరాలకు గ్రీన్ టాంకర్లను వాడాలని వాటర్ బోర్డ్ ఎండీ సూచించారు.