సీతంపేట గ్రామంలో వింత ఆచారం.. దీపావళి అయినంక బతుకమ్మ సంబరాలు !

సీతంపేట గ్రామంలో వింత ఆచారం.. దీపావళి అయినంక బతుకమ్మ సంబరాలు !

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామంలో వింత ఆచారం ఉంది. దీపావళి అయినంక బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. ఈ గ్రామంలో ఆడా-మగ కలిసి ఆడుకునే సాంప్రదాయ వేడుక ఇది. ఈ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలకు 200 ఏళ్ల చరిత్ర.. సామాజిక నేపథ్యం ఉంది. నేతకాని కులస్తులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. దీపావళి సందర్భంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం వెనుక చాలాపెద్ద చరిత్ర ఉందని నేతకాని కులస్తులు చెప్పారు.

దీపావళి అనంతరం చివరి రోజు  వివిధ రకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో నేతకాని కులస్తులు స్త్రీలు, పురుషులు అందరూ గ్రామ చెరువు దగ్గరకు చేరుకొని ఆటపాటలతో సందడి చేస్తారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయని నేతకాని కుల పెద్దలు చెప్పారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని ఈ తరంతో పాటు వచ్చే తరాలు కూడా కొనసాగిస్తాయని చెబుతున్నారు. నేతకాని కులస్తులు ఆటపాటలతో బతుకమ్మను గంగమ్మ ఒడికి సాగనంపనున్నారు.

ALSO READ : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ..తమిళనాడులో ఉరుములతో వర్షాలు