Priya Bhavani Shankar Wedding: రవితేజ ఇరుముడి హీరోయిన్ పెళ్లి సందడి.. ప్రియుడితో ఏడడుగులు వేసేందుకు ప్రియా రెడీ?

Priya Bhavani Shankar Wedding: రవితేజ ఇరుముడి హీరోయిన్ పెళ్లి సందడి.. ప్రియుడితో ఏడడుగులు వేసేందుకు ప్రియా రెడీ?

తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బ్యూటీ ప్రియా భవానీ శంకర్. ఇటీవల రవితేజ సరసన నటించిన 'ఇరుముడి' బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.  అయితే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు రాజ్‌వెల్ రాజ్‌తో  ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 ప్రియా భవానీ శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ప్రత్యేకమైన చిత్రాలను పంచుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, మెడలో మల్లెపూల దండలు ధరించి తన ప్రియుడు రాజ్‌వెల్‌తో కలిసి కనిపించారు. మరోవైపు చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకున్న ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలకు తోడు వివాహ వేడుకను తలపించే సంగీతం కూడా ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇవి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలే అని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

కాలేజీ రోజుల్లో మొదలైన  ప్రియా, రాజ్‌వెల్  పరిచయం ప్రేమగా మారింది. దాదాపు దశాబ్దానికి పైగా సాగుతున్న ఈ బంధంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఇద్దరూ కలిసి ప్రయాణం కొనసాగించారు. 2020లోనే ప్రియా తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా వ్యక్తం చేశారు. 

ALSO READ : ఈ వీకెండ్ ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. స్ట్రీమింగ్‌కు వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!

అంతే కాదు 2022లో ఈ జంట చెన్నైలో సముద్రానికి ఎదురుగా ఉన్న తమ డ్రీమ్ హౌస్‌ను కొనుగోలు చేశారు.  అయితే అప్పట్లో పెళ్లి వార్తలను ఖండించి, అది కేవలం గృహప్రవేశ వేడుకేనని స్పష్టం చేశారు. 2024లో ఓ ఇంటర్వ్యూలో 2025లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని కూడా ప్రియా వెల్లడించారు.  మరి ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలు నిజంగానే పెళ్లి వేడుకలకు సంబంధించినవా? పెళ్లి తేదీ ఎప్పుడు? అన్నది తెలియాలంటే ప్రియా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి..