ముంబై, పంజాబ్ ట్రేడ్ డీల్‌కు BCCI గ్రీన్ సిగ్నల్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్..!

ముంబై, పంజాబ్ ట్రేడ్ డీల్‌కు BCCI గ్రీన్ సిగ్నల్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్..!

న్యూఢిల్లీ: 2027 సీజన్‎కు ముందే ఐపీఎల్‎లో భారీ ట్రేడ్ డీల్ కుదిరింది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ప్రతిపాదిత ట్రేడ్ డీల్‎కు బీసీసీఐ ఆమోదం తెలిపింది. ఇరు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల మార్పిడికి సంబంధించిన అధికారిక పత్రాలను బీసీసీఐకి సమర్పించగా రెగ్యులేటర్ల నుంచి దీనికి అధికారిక ఆమోదం లభించింది. ఈ ఒప్పందంలో భాగంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య పంజాబ్ జట్టులోకి వెళ్లనుండగా.. పంజాబ్ స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ ముంబై టీమ్‎లోకి రానున్నాడు. హార్ధిక్ పాండ్యకు పంజాబ్ రూ.16.35 కోట్లు చెల్లించనుండగా.. ముంబై అర్షదీప్‎కు రూ.18 కోట్ల భారీ పారితోషికం ఇవ్వనుంది. ఇరు ఆటగాళ్ల పూర్తి సమ్మతితోనే ఈ ఒప్పందం పూర్తయింది. ఈ ప్లేయర్ల స్వాప్ డీల్‎కు సంబంధించి ముంబై, పంజాబ్ జట్ల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

2024 సీజన్‏లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‎గా వచ్చాడు హార్దిక్ పాండ్య. అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు బాధ్యతలను చేపట్టాడు. అయితే, ఈ ప్లాన్ బెడిసికొట్టింది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై.. హార్ధిక్ సారథ్యంలో రెండు సార్లు కనీసం ప్లే ఆఫ్స్‎కు కూడా చేరకుండానే ఇంటి బాట పట్టింది. రోహిత్‎ను కాదని పాండ్యకు కెప్టెన్సీ అప్పగించడంతో ముంబై జట్టులో చీలికలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. 

జట్టు రెండు వర్గాలుగా చీలిపోయిందని.. కొందరు రోహిత్‎కు మద్దతు ఉంటే.. ఇంకొందరు పాండ్య వైపు అండగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రభావం ముంబై జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. హార్దిక్ నిర్లక్ష్య పూరిత వైఖరితో టీమ్ నష్టపోయినట్లు ముంబై యాజమాన్యం కూడా భావించిందట. ఈ నేపథ్యంలోనే అతడిని వదులుకున్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

ALSO READ : IPL 2027 మినీ వేలానికి కౌంట్‌డౌన్ స్టార్ట్

మరోవైపు అర్ష్ దీప్‎ను వదులుకున్న పంజాబ్ డిసిషన్ కూడా అంత ఈజీ కాదు. 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుండి పంజాబ్ కింగ్స్‌కు నమ్మకమైన బౌలర్‌గా ఉన్నాడు పేసర్ అర్ష్‌దీప్ సింగ్. తన అద్భుతమైన బౌలింగ్‎తో ఎన్నో మ్యాచుల్లో పంజాబ్‎కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. జట్టులో ప్రధాన బౌలర్‎గా ఉన్న అర్షదీప్ నిష్క్రమణ పంజాబ్‎కు కచ్చితంగా ఎదురు దెబ్బే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ అర్ష్ దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన హార్ధిక్ ఎంత వరకు జట్టు అంచనాలను ఫుల్ ఫిల్ చేస్తాడనేది చూడాలి.