కార్తీకమాసంలో గోవర్దన పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎవరినైనా అవమానిస్తే తప్పకుండా క్షమాపణ చెప్పాలి. ఇందుకు నిదర్శనంగా ఇంద్రుడు .. శ్రీకృష్ణుడికి క్షమాపణ చెప్పాడు. అసలు ఎందుకు శ్రీకృష్ణుడిని ఇంద్రుడు అవమాన పర్చాడు.. ఆతరువాత ఏంజరిగింది. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
అవమానించడం.. క్షమాపణలు చెప్పడం ఈ తతంగం ఇప్పటిది కాదు.. శ్రీకృష్ణుని కాలం నుంచి కొనసాగుతుంది. ద్వాపరయుగంలో కూడా ఇంద్రుడు .. శ్రీకృష్ణుడిని అవమానించాడు. అప్పుడు ఆ పరమాత్మ మాయతో ఇంద్రుడికి అన్నపానీయాలకు ఇబ్బంది కలిగేలా చేశాడు.
తన తప్పు తెలుసుకున్న ఇంద్రుడు .. శ్రీ కృష్ణుడిని క్షమాపణ అడిగాడు. అయితే పగతోనో.. కక్షసాధించడానికో శ్రీకృష్ణుడు.. ఇంద్రుడిని ఇబ్బంది పెట్టలేదు. ఇతరులకు అనవసరంగా అమానిస్తే ఏం జరుగుతుంలో తరువాత తరాల వారికి తెలియజెప్పేందుకే ఇలా చేశాడు. అందుకే ఇందంరుడు క్షమాపణ కోరిన వెంటనే వెంటనే ఆయనను ఇబ్బందుల నుంచి తొలగించాడు. ఈ ప్రక్రియలోనే గోవర్దన పూజను ఇంద్రుడు చేసి శ్రీకృష్ణుడికి క్షమాపణ చెప్పాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ద్వాపర యుగంలో మథుర ప్రాంతంలో వర్షాలు కురిపించే దేవుడిగా ఇంద్రుడిని ఆ ప్రాంత ప్రజలు పూజించేవారు. శ్రీకృష్ణుడి పెంపుడు తండ్రి నందుడు కూడా ఈ పూజలో పాల్గొనేవారు. ఒకసారి శ్రీకృష్ణుడు ఇంద్రుడిని ఎందుకు పూజిస్తున్నారని నందుడిని ప్రశ్నించాడు. ఇంద్రుడి అనుగ్రహంతో వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయని... పశువులకు పచ్చిక దొరుకుతుందని, అందుకే ఇంద్రుడిని పూజిస్తున్నామని నందుడు చెబుతాడు.
అయితే శ్రీకృష్ణుడు ఈ సంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. తమ జీవనానికి ఆధారమైన గోవులు మేత మేసే గోవర్ధన పర్వతాన్ని పూజించాలని ప్రజలకు సూచించాడు. దీంతో ప్రజలు ఇంద్రుడి పూజకు బదులుగా గోవర్ధన పర్వతానికి పూజలు చేయడం ప్రారంభించారు.
భారీ వర్షాలు కురిపించిన ఇంద్రుడు
తనకు బదులుగా గోవర్దనగిరికి పూజలు చేస్తున్నందుకు ఆగ్రహించిన ఇంద్రుడు అవమానంగా భావించాడు. ఆ ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకున్న ఇంద్రుడు ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిపించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆ సమయంలో తమను రక్షించాలని శ్రీకృష్ణుడిని ప్రజలు వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ప్రజలందరూ తమ పశువులతో సహా ఆ పర్వతం కింద ఆశ్రయం పొందారు.
ఎన్ని రోజులు వర్షాలు కురిసినా వారికి ఎలాంటి ప్రమాదం కలగలేదు. ఈ సమయంలో శ్రీకృష్ణుడికి రకరకాల ఆహార పదార్థాలను తయారుచేసి నైవేద్యంగా సమర్పించారు. ఈ సంప్రదాయమే క్రమంగా అన్నకూట్ భోగంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు.
ఇంద్రుడి క్షమాపణ..
శ్రీకృష్ణుడి మహిమను తెలుసుకున్న ఇంద్రుడు తన తప్పును గ్రహించాడు. అనంతరం శ్రీకృష్ణుడిని క్షమాపణ కోరాడు. అప్పుడు ఇంద్రుడు గోవర్దనగిరి పర్వతానికి పూజచేసి ప్రదక్షిణలు చేశాడు. అప్పటి నుంచి ప్రజలను రక్షించిన శ్రీకృష్ణుడు ఇకపై గోవర్ధన పర్వతాన్ని పూజించాలని, దానికి ప్రదక్షిణలు చేయాలని సూచించినట్లు పండితులు చెబుతున్నారు. అప్పటి నుంచి పర్వతాకారంలో గోవర్ధనుడి ప్రతిమను రూపొందించి పూజించడం, అన్నకూట్ నైవేద్యాన్ని సమర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
►ALSO READ | జ్యోతిష్యం: ఏ రెండు గ్రహాలు కలిస్తే ఎలా ఉంటుంది.. ఏ సమయంలో పుట్టిన వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు..!
కార్తీకమాసం ప్రారంభమైన తొలిరోజు ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సమయంలో గోవర్ధనుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఇంట్లో అన్నధాన్యాలకు, సంపదకు లోటు ఉండదనిపండితులు చెబుతున్నారు.. అందుకే ఇతరులను అవమానిస్తే ఇబ్బందులు తప్పక వస్తాయి. అయితే జాతకంలో గ్రహాల బలం ఉంటే తాత్కాలికంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కాని అవి బలహీనపడినప్పుడు ఇతరులను ఆ ఫలితం తప్పక అనుభవించి తీరాలి. అందుకే తెలిసి అవమానిస్తే క్షమాపణలు చెపితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది.
కలియుగంలో మానవులు ఒక్కోసారి ఏం తప్పులు చేస్తున్నారో.. వారు చేసే చర్యల వలన ఇతరులు అవమానాలు పొందుతున్నారనే విషయాన్ని కూడా గ్రహించలేదు. అందుకే కార్తీకమాసం తొలిరోజున సాయంత్రం శివాలయ దర్శనం చేసి.. అక్కడ గోవర్దన పర్వతాన్ని తలచుకొని తెలిసీ.. తెలియక చేసిన ఇతరులను ఇబ్బంది పెట్టే పనులను క్షమించమని ప్రార్థించాలని పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసంలో గోవర్దన పూజను చేయాలి. ఈ పూజను చేయడం వలన ఇతరులను అవమానించిన దోషం తొలగుతుందని పండితులు చెబుతున్నారు. ఎవరైనా తెలియక ఇతరులను అవమానిస్తే గోవర్దన పూజతో ఆ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
