జియో కస్టమర్లకు ఇంతకు మించిన బెస్ట్ రీఛార్జ్ ఆప్షన్ ఉండదు !

జియో కస్టమర్లకు ఇంతకు మించిన బెస్ట్ రీఛార్జ్ ఆప్షన్ ఉండదు !

జియో కస్టమర్లకు డేటాతో పెద్దగా అవసరం లేకపోతే 189 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవడం బెటర్. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2జీబీ హై స్పీడ్ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 300 SMSలు కూడా పంపించుకోవచ్చు.

వాట్సాప్ చాటింగ్, బయటకు వెళ్లినప్పుడు యూపీఐ పేమెంట్స్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ వాడుకునే జియో యూజర్లకు ఈ 189 రూపాయల రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. నెలకు 200 రూపాయల లోపే అయిపోతుంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ అని చెప్పొచ్చు. రోజుకు 1.5జీబీ డేటా వాడేవాళ్లకు ఈ ప్లాన్ పనికిరాదు.

ఇంట్లో, ఆఫీస్లో Wi-Fi ఉండి.. బయటకు వెళ్లినప్పుడు చాటింగ్, యూపీఐ ట్రాన్షాక్షన్స్ చేసుకునే వాళ్లకు అయితేనే ఈ రూ.189 ప్లాన్ సరిపోతుంది. వాయిస్ కాల్స్కు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే కస్టమర్లు కళ్లు మూసుకుని ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.

►ALSO READ | పెప్సికోలో లేఆఫ్స్.. అమ్మకాలు తగ్గుడుతో వెయ్యి మందిని పీకేసిన కంపెనీ

ఎయిర్ టెల్ కస్టమర్లకు కూడా ఇలాంటి ప్లాన్ అందుబాటులో ఉంది. 185 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయి. కానీ.. ఇది కేవలం వాయిస్ ఓన్లీ ప్లాన్. డేటా కావాలంటే సపరేట్ డేటా ప్యాక్స్తో రీఛార్జ్ చేసుకోక తప్పదు.