తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దానిపైనే చర్చ నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా కొణిదెల తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు . ఇది సినీ, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే ఈ పరిణామం జరిగిన కొద్ది గంటల్లోనే పవన్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? అంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో మనుషుల మధ్య దయ, జాలి, సానుభూతి ఎంత ముఖ్యమో వివరిస్తూ ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింతగా దూషించడం నైతికంగా సరైనది కాదని పేర్కొన్నారు. ఇప్పటికే కిందపడిపోయిన వారిని మళ్లీ తొక్కడం అమానుషమని అన్నారు. ఎలాంటి స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరూ మనుషులేనని, ఎవరికో ఒకరికి బిడ్డగా, తల్లిదండ్రులుగా, తోబుట్టువులుగా ఉంటారని గుర్తు చేశారు.
అంతేకాదు.. మన ఇళ్లే పరిపూర్ణంగా లేనప్పుడు ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరకూడదని హితవు పలికారు. మనిషిగా పిలవబడాలంటే సానుభూతి, దయ తప్పనిసరి అని స్పష్టం చేశారు. తన పోస్ట్ ఆధారంగా అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని కూడా కోరారు. ఎవరో తనకు డబ్బులు ఇచ్చి ఈ మాటలు రాయించలేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
అయితే పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రేణు పోస్ట్ తెరపైకి రావడంతో చర్చ మరింత వేడెక్కింది. గతంలో పవన్‌తో విడిపోయిన రేణుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె తన లేటెస్ట్ పోస్టులో పవన్ పేరు కానీ, అన్నా పేరు కానీ ప్రస్తావించలేదు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ.. మరింత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
ALSO READ : రవితేజ ఇరుముడి హీరోయిన్ పెళ్లి సందడి..
మరోవైపు పవన్, అన్నా తమ నిర్ణయం పరస్పర అవగాహనతో తీసుకున్నామని, పిల్లల బాధ్యతను కొనసాగిస్తామని సంయుక్త ప్రకటనలో తెలిపారు. మరి రేణు పోస్ట్ ఈ పరిణామాలకు సంబంధించిందేనా? లేక సమాజంలో పెరుగుతున్న వ్యక్తిగత దూషణలపై సాధారణంగా స్పందించారా? అన్నది ఆమె స్పష్టం చేస్తేనే తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..
