ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: ఐదు సరికొత్త పాలసీలకు ఆమోదం.. రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: ఐదు సరికొత్త పాలసీలకు ఆమోదం.. రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం (నవంబర్ 10) కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రివర్గం సుమారు 30కి పైగా కీలక అంశాలకు, ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. విశాఖలో నవంబర్ 11, 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‎పై మంత్రి మండలి చర్చించింది. సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంపై సమీక్షించింది. 

కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

  • రాంబిల్లిలో రూ.570 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ పరిశ్రమకు ఆమోదం.
  • నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ తయారీ పరిశ్రమకు ఆమోదం.
  • తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమకు ఆమోదం.
  • భీమిలి అమనంలో రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్ కు ఆమోదం.
  • పశ్చిమగోదావరిలో రావళి స్పిన్నర్స్ రూ.237 కోట్ల పరిశ్రమ విస్తరణకు ఆమోదం.
  • నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాల కేటాయింపు.
  • జగ్గయ్యపేటలో 30 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్కుకు ఆమోదం.
  • భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్కు 24.96 ఎకరాల భూమి.
  • విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన