పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాడా.. వేణు స్వామి జోస్యం నిజమవుతుందా..?

పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాడా.. వేణు స్వామి జోస్యం నిజమవుతుందా..?

పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా దంపతుల విడాకులపై సోసల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పవన్ మూడోసారి విడాకులు తీసుకున్నారు.. నాలుగో పెళ్లి చేసుకుంటారా..? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గతంలో చెప్పిన జ్యోతిష్యం ఆధారంగా పవన్ నాలుగో పెళ్లి గురించి చర్చ జరుగుతోంది. 

వేణుస్వామి గతంలో ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ విడాకులు, నాలుగో పెళ్లిపై మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల క్రితం ఒక ఛానెల్ లో మాట్లాడుతూ పవన్ 2026లో విడాకులు తీసుకుంటారు అని అన్నారు. 

మీరెలా చెబుతున్నారు..? అని జర్నలిస్టు ప్రశ్నించగా జ్యోతిష్యం ఆధారంగా చెబుతున్నానని అన్నారు. ఆయన వ్యాఖ్యలను రిపోర్టర్ ఖండించినా.. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటారని.. నాలుగో పెళ్లి చేసుకుంటారని ఆ ఇంటర్వ్యూలో వేణు స్వామి చెప్పారు. ఇప్పుడు విడాకుల మాట నిజం అవ్వటంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

వేణుస్వామి వీడియోను కోట్ చేస్తూ.. పవన్ నాలుగో పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు నాలుగో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుంటే.. విడాకులు ఎందుకు తీసుకుంటారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.