మన దేశంలోని యూపీలో నిందితుల ఇళ్ల మీదకు బుల్డోజర్లు వెళ్లి కూలగొట్టడం చూశాం. చైనాలో ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయం పైకి నిందితుడు బుల్డోజర్ ఎక్కించేశాడు. చైనాలోని జియాన్‌లో ప్రభుత్వ కార్యాలయం మీదకు ఎక్స్కావేటర్ను పోనిచ్చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
A man in China drove an excavator into a government service centre in Shaanxi and spent about an hour tearing off its entrance while nobody dared stop him. @grok was this really about one man's farm payout, or villagers still waiting for their relocation money? https://t.co/WDGDqCuwwS
— Worth a Look (@Jinfeng_tlqm) November 10, 2026
నవంబర్ 9న ఈ ఘటన జరిగింది. షాన్సీ ప్రావిన్స్‌లోని జియాన్, జిజియాన్ న్యూ ఏరియా, ఫెంగ్డాంగ్ న్యూ సిటీలో ఉన్న ప్రభుత్వ సేవా కేంద్రంలోకి ఎక్స్కావేటర్ను నడిపి, ఎంట్రీ దగ్గర పైకప్పు, మెట్లు, బిల్డింగ్ ముందు భాగంలోని కొన్ని భాగాలను నిందితుడు కూల్చివేశాడు.
ఎక్స్‌కావేటర్ దాదాపు గంటసేపు బిల్డింగ్ ముందు భాగాన్ని ధ్వంసం చేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. నవంబర్ 9 సాయంత్రం పోలీసులు ఈ ఘటనపై ప్రకటన చేశారు. అధికారులు ఉదయం 11:00 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకుని, 'హు' అనే ఈ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
►ALSO READ | ఈ దేశానికి వెళ్లొద్దు.. అమెరికా వార్నింగ్ ! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల లిస్టు విడుదల..
అదే రోజు మధ్యాహ్నం ఆ గవర్నమెంట్ ఆఫీస్‌లో కార్యకలాపాలు యధావిధిగా నడిచాయి. నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు తమ అధికారిక ప్రకటనలో ఈ ఘటనకు కారణాన్ని వెల్లడించలేదు. ప్రభుత్వ ప్రాజెక్టుకు సంబంధించిన కూల్చివేత పరిహారం విషయంలో ఆ వ్యక్తికి, సదరు ప్రభుత్వ కార్యాలయ అధికారులతో చాలా కాలంగా వివాదం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
