'కె.జి.ఎఫ్', 'సలార్', 'కాంతార' వంటి విజువల్ వండర్స్‌తో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచపటంపై నిలిపిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ మరో సంచలన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. 'మహావతార్ నరసింహ'తో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన హోంబాలే.. ఇప్పుడు 'ట్రాన్స్‌డెంటల్ ఫిలిమ్స్' భాగస్వామ్యంతో శతాబ్దపు గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు, ఇస్కాన్ (ISKCON) వ్యవస్థాపక ఆచార్యులు శ్రీల ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల జీవితగాథ ఆధారంగా'శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరండర్డ్ సోల్' అనే భారీ యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
1965లో తన 69వ ఏట భారత్ నుంచి అమెరికాకు ప్రయాణమైన శ్రీల ప్రభుపాదులు.. భగవద్గీత బోధనలు, శ్రీకృష్ణుడి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన జీవితంలోని భక్తి, త్యాగం, పట్టుదల, సేవాభావం ఈ చిత్రంలో ప్రధానంగా ఆవిష్కృతం కానున్నాయి.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే... అంతర్జాతీయ స్థాయి అడ్వాన్స్డ్ ఏఐ మోషన్ క్యాప్చర్ (AI Motion Capture) సాంకేతికతను ఉపయోగించడం. మానవ కదలికలు, రసభరితమైన హావభావాలను కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డిజిటల్ యానిమేషన్‌గా మలిచి, ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా, అద్భుతంగా ఆవిష్కరించనున్నారు.
►ALSO READ | OTT Review: హాస్పిటల్ ICUలో వరుస మరణాలు.. ఓటీటీలో ఎంగేజ్ చేస్తున్న మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్!
గౌర శక్తి దాస రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ సింగ్, లోహిత్ రావు నిర్మిస్తుండగా, శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హోంబాలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. శ్రీ నరసింహ చైతన్య మఠం (శ్రీరంగపట్నం), ఇస్కాన్ బెంగళూరు, ఇస్కాన్, భక్తివేదాంత బుక్ ట్రస్ట్ (BBT) ఆశీస్సులతో రూపొందుతున్న ఈ భక్తిరస దృశ్య కావ్యం, 2027 ఆగస్టులో శ్రీల ప్రభుపాదుల వ్యాసపూజ పవిత్ర పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Hare Krishna! 💙🪷 With the blessings of Sri Krishna, we present the TITLE TEASER of #Saranagati. ✨ WATCH NOW ▶️ https://t.co/SgqqF80ai9 “O Kṛṣṇa, I am just a puppet in Your hands. Make me dance, make me dance, O my Lord make me dance as You like.” Haribol! 🙏 @hombalefilms @VKiragandur @girishkarigiri @ChaluveG #TranscendentalFilms #KarigiriFilms @SaranagatiFilm @NarrativePlus_ #HombaleFilms #LordKrishna
— Hombale Films (@hombalefilms) November 10, 2026
