కార్తీకమాసం ప్రారంభమైంది ( నవంబర్ 10) . ఈ మాసంలో హిందువులు పరమేశ్వరుడిని పూజిస్తారు. స్కాంద పురాణం ప్రకారం ఈ నెలలో శివుడి భార్య పార్వతీదేవి రుబ్బురోలుకు పూజ చేసింది. కలియుగంలో కూడా హిందువులు చాలా మంది ఈ పూజను చేస్తారు కానీ దాని వెనుక ఉన్న కారణం చాలా మందికి తెలియదు. ఈ స్టోరీలో పరమేశ్వరుడికి ..రుబ్బురోలుకు ఉన్న సంబంధం ఏమిటి.. కార్తీకమాసంలో ఎందుకు పూజించాలి.. ఆ ఆచారం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
కార్తీకమాసం చాలా పవిత్రమైన నెల.. ఈ నెలలో శివ కేశవులను పూజిస్తారు. నెల రోజుల పాటు రుబ్బురోలును అలంకరించి పార్వతి పరమేశ్వరులను పూజించి పూజించే ఆచారం ఉంది. కార్తీక మాసంలో రుబ్బురోలును పూజించడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసంలో ఆధ్యాత్మికంగా నిర్వహించే ఆచారాలకు.. పురాణాల్లో పేర్కొన్న అంశాలకు సైన్సుకు దగ్గరి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు ధృవీకరించారని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో రుబ్బురోలుకు పూజ చేయడం.. ఎంతో పవిత్రంగా భావించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం.. ఇలా ఎందుకు చేస్తారో తెలియక పోయినా పెద్దలు అనుసరించారు కాబట్టి రుబ్బు రోలుకు పూజ చేస్తారు.
రుబ్బురోలుకు.. ప్రకృతి ఉన్న సంబంధం ఇదే..!
కార్తీకమాసంలో ప్రకృతి స్వభావం చల్లబడుతుంది. ఈ కాలంలో రుబ్బురోలు వంటి పరికరాలు ఎక్కువగా వాడబడవు. అందువల్ల వాటిని పూజించడం, శుభ్రం చేయడం, మళ్లీ పవిత్రం కల్పించడం అనే ఆచారం ఏర్పడింది.
స్కాంద పురాణం ప్రకారం
పురాణాల ప్రకారం పార్వతీ దేవి స్వయంగా రుబ్బురోలులో సుగంధ ద్రవ్యాలను పొడి చేసేవారు. పార్వతిదేవి భూమాత రూపంలో ఉన్న రాతిని పూజించడం వలన పాపాలు తొలగిపోతాయి అని స్కాంద పురాణంలో చెప్పబడింది. రుబ్బురోలు అన్నదానానికి సంకేతం. కాబట్టి ఆ పరికరానికి పూజ చేస్తే ఇంట్లో ఎప్పటికీ అన్నం కొరత ఉండదని పురణాల ద్వారా తెలుస్తుంది.
►ALSO READ | Health Tips: చిటికెడు ఇంగువ.. బోలెడు లాభాలు..!
దేవతల పూజ
రుబ్బురోలు అనేది మన పాత పద్దతుల్లో ప్రతి ఇంట్లో ఉండే ఒక సాధనం. దీనితో మసాలాలు, పప్పులు, బియ్యం మొదలైనవి రుద్దేవారు. ఆ రాతి పరికరం మీద రోజూ ఆహారం తయారీకి అవసరమైన పదార్థాలు తయారవుతాయి కాబట్టి ఇది ఆహారానికి, అన్నదాతకు ప్రతీకగా భావించబడింది.
పురాతన కాలంలో మన పెద్దలు ఆ పరికరాన్ని కూడా పవిత్ర మైనదిగా పరిగణించారు. ఎందుకంటే ఆ పరికరంతో తయారైన ఆహారం దేవుడికి నైవేద్యంగా వెళ్తుంది. అందుకే రుబ్బురోలు పూజ అనేది దేవతల పూజలో భాగంగా ఏర్పడింది.
రుబ్బురోలు అనేది కేవలం రాయి కాదు అది భూమాతకు ప్రతీక. మనం భూమిపై పంటలు పండించి ఆహారం పొందుతున్నాము. రుబ్బురోలు ఆ పంటల పదార్థాలను మృదువుగా మార్చే సాధనం. కాబట్టి దానికి పూజ చేయడం అంటే మన భూమాతకు కృతజ్ఞత తెలపడం. ఇది మన పూర్వీకులు ప్రకృతిని పూజించే పద్ధతిలో భాగమని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
