చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా? ఆరోగ్యానికి అమృతంలా పనిచేసే అద్భుత ప్రయోజనాలు!

చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా? ఆరోగ్యానికి అమృతంలా పనిచేసే అద్భుత ప్రయోజనాలు!

Jaggery Benefits: చలికాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఒంట్లో నీరసం, అలసట, దగ్గు, జలుబు లాంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఈ చలికి చెక్ పెట్టి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో బెల్లం (Jaggery) అద్భుతంగా పని చేస్తుంది. షుగర్‌తో పోలిస్తే బెల్లం ఆరోగ్యాకి ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా వింటర్ సీజన్‌లో దీన్ని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల బెల్లంలో దాదాపు 11 మిలీగ్రాముల వరకు ఈ ఖనిజాలు లభిస్తాయి.

చలికాలంలో బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

రక్తహీనతకు చెక్: బెల్లంలో ఉండే ఐరన్ శాతం శరీరంలో హిమోగ్లోబిన్‌ను వేగంగా పెంచుతుంది. ఇది రక్తహీనత (Anemia) సమస్యను తగ్గించి, నీరసం, అలసటను దరిచేరనీయకుండా రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.

దగ్గు, జలుబు దూరం: బెల్లంలో సహజమైన యాంటీ-అలర్జీ గుణాలు ఉంటాయి. ఇది శీతాకాలంలో తరచూ వచ్చే దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ: బెల్లంలో మెగ్నీషియంపాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.

బెల్లంతో ఆరోగ్యకరమైన బెస్ట్ కాంబినేషన్స్: 

కేవలం బెల్లం విడిగా తినడం ఇష్టం లేని వారు ఇతర ఆరోగ్యకరమైన పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు.. శీతాకాలానికి ఇవి అత్యంత శ్రేయస్కరం. 

బెల్లం - వేరుశనగలు (పల్లి చిక్కీ): పల్లీలు, బెల్లం కలిపి తయారు చేసే పల్లిపట్టి రూపంలో తీసుకోవడంతో మహిళల్లో పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

బెల్లం - పుట్నాల శనగలు: బెల్లం, పుట్నాలు కలిపి తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగవుతాయి.

పసుపు - బెల్లం - నెయ్యి: ఈ కాంబినేషన్ చలికాలంలో దివ్యౌషధంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తిని (Immunity) విపరీతంగా పెంచేందుకు ఇది అత్యుత్తమ మిశ్రమం.

బెల్లం - నువ్వులు - నెయ్యి: నువ్వులు, నెయ్యి, బెల్లం కలిపి తింటే చలికాలంలో వేధించే దగ్గు, జలుబు సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు. శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. ఇకపై చలికాలంలో మీ డైట్‌లో బెల్లంను కచ్చితంగా చేర్చుకోండి.. ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.. 

►ALSO READ | వార్డ్ రోబ్ నీట్ గా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..