విజయవాడ ఇంద్రకీలాద్రిపై టాలీవుడ్లో అగ్ర నిర్మాతగ దిల్రాజు ఫ్యామిలీపై సందడి చేశారు. ఈ రోజు ( నవంబర్ 11, 2026 ) కుటుంబ సమేతంగా శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అంతకు ముందు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన దిల్రాజు కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గాజుల అలంకరణలో కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్న దిల్రాజు దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
►ALSO READ | Maatrubhumi Trailer Out: చైనా సైనికులతో సల్మాన్ ఖాన్ ఫైట్.. 'మాతృభూమి' ట్రైలర్ రిలీజ్!
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ వేద పండితులు దిల్రాజు కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజ ఇంద్రకీలాద్రి ఆలయ విశిష్టత, అమ్మవారి అలంకరణ ప్రత్యేకత భక్తులను ఆకట్టుకున్నాయి. దిల్రాజు కుటుంబం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#Vijayawada ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ #TFDC ఛైర్మన్ దిల్ రాజు దంపతులు.. #RamayanaMovie తో విజయాన్ని అందుకున్న #Dilraju త్వరలో.. నాగచైతన్య #Vrushakarma మెగాస్టార్ చిరంజీవి #Kaka వెంకటేష్ అనీల్ రావిపూడి ల #January12vidudala చిత్రాలను పంపిణీ చేస్తున్నారు.. #Anilravipudi #Kalyanram #Chaitanya #Megstarchiranjeevi #Venkatesh
— SZN (@Suzenbabu) November 11, 2026
