బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి దేశభక్తి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈసారి యాక్షన్, ఎమోషన్, దేశభక్తిని కలగలిపి 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' (Maatrubhumi: May War Rest in Peace) సినిమాతో అలరించబోతున్నారు. గతంలో 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరుతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ మార్చడంతో పాటు కీలక మార్పులు చేశారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల నేపథ్యంలో ఈ సినిమా పేరును 'మాతృభూమి'గా మార్చినట్లు సమాచారం.
భారీ అంచనాల మధ్య డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సల్మాన్ ఖాన్ ఆర్మీ కమాండర్‌గా పవర్ఫుల్ అవతారంలో కనిపించాడు. భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, సైనికుల పోరాటం, కుటుంబాలకు దూరంగా ఉండే జవాన్ల భావోద్వేగాలు ట్రైలర్లో ప్రధానంగా చూపించారు.
కేవలం తుపాకులు, యుద్ధ సన్నివేశాలకే పరిమితం కాకుండా సైనికుడి కుటుంబ జీవితం, త్యాగాలు, మరణం పట్ల అతడికి ఉండే ధైర్యాన్ని కూడా ఆవిష్కరించారు. ముఖ్యంగా శత్రువును నాశనం చేయడం కాదు.. శత్రుత్వాన్ని అంతం చేయడమే మానవత్వం, దేశభక్తి అనే సందేశం ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో సల్మాన్ చెప్పిన కొన్ని డైలాగులు కూడా వైరల్ అవుతున్నాయి.
ALSO READ : సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రియా భవానీ శంకర్..
ముఖ్యంగా చైనా సైనిక అధికారితో 'లెట్స్ సార్ట్ దిస్ షిట్, బ్రో!' అంటూ చెప్పే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక సల్మాన్ సరసన చిత్రాంగద సింగ్ భార్య పాత్రలో కనిపించనుంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అభిలాష్ చౌదరి, అంకుర్ భాటియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఈ సినిమా వాయిదాల వెనుక విజువల్ ఎఫెక్ట్స్ పనులు, చిత్రాంగద సింగ్ గాయం కారణంగా షూటింగ్ ఆలస్యం కావడం కూడా ఉన్నట్లు సల్మాన్ వెల్లడించాడు. ఇది బయోపిక్ కాదని, వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కథ అని కూడా స్పష్టం చేశాడు. మరో వైపు 40 శాతానికి పైగా సన్నివేశాలను రీషూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ 'మాతృభూమి' థియేటర్లలో సల్మాన్ కు బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...
