Priya Bhavani Shankar : సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. వరుడు ఎవరంటే?

Priya Bhavani Shankar : సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. వరుడు ఎవరంటే?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి నెలకొంది.  కొందరు హీరోలు నిశ్చితార్థాలతో వివాహానికి రెడీ అయితే.. మరికొందరు సెలబ్రిటీలు మాత్రం ఏకంగా పెళ్లి పీటలెక్కి అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా రవితేజ ' ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన ప్రియుడు పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాంటి హంగామా, ఆర్భాటాలు లేకుండా అత్యంత సన్నిహితుల మధ్య ఆమె వివాహం జరిగింది.

చెన్నైలో బుధవారం ( నవంబర్ 11, 2026 ) ఉదయం ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది.. గత పదేళ్లకు పైగా సాగిన వీరి ప్రేమ ప్రయాణానికి పెళ్లితో ఒక్కటైంది ఈ జంట.  ప్రియ తన కాలేజీ రోజుల్లో స్నేహితుడు రాజ్ వేల్ తో ప్రేమలో ఉంది. చదువుకునే రోజుల నుంచే మొదలైన వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. తమ రిలేషన్ షిప్ గురించి గతంలోనే ప్రియా బహిరంగంగా వెల్లడించింది. అంతే కాదు.. కొన్నేళ్ల క్రితమే ఇద్దరూ కలిసి చెన్నై బీచ్ ఒడ్డున ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు గతంలోనే వార్తలు కూడా వచ్చాయి.

ఇక ప్రియా భవానీ శంకర్ కెరీర్ విషయానికి వస్తే.. న్యూస్ యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో 'కళ్యాణం కమనీయం','భీమా', 'జీబ్రా' సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల 'ఇరుముడి'తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 

ALSO READ : నాస్తికుడిగా 'రామాయణ' చూశా..

ఇదిలా ఉంటే... ఇటీవల సాయిధరమ్ తేజ్ నిశ్చితార్థం, తేజ సజ్జా పెళ్లి వార్తలు, అనిరుధ్-కావ్య మారన్ వివాహంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పెళ్లి సందడి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రియా పెళ్లితో అభిమానుల ఆనందం రెట్టింపైంది. పదేళ్ల ప్రేమకు కొత్త జీవితంతో శ్రీకారం చుట్టిన ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు...