అక్షయ్ లగుసాని, కేయూరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు’. ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కన్ను సమీర్, వెన్నపూస శ్రీకర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘మేఘాలు సంద్రంలో’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘ఈ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గిరి, ప్రణయ్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది.
ఈ ఇద్దరి పేర్లు ఇండస్ట్రీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది. సింజిత్ అద్భుతమైన పాటల్ని ఇచ్చాడు. ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు. ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల అక్షయ్ లగుసాని, కేయూరి సంతోషం వ్యక్తం చేశారు. ఇందులోని అన్ని పాటలు బాగుంటాయని, సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుందని దర్శకులు ప్రణయ్, గిరి అన్నారు. ఈటీవీ విన్ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ భరణ్, నటుడు జై కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు. డిసెంబర్ 11న సినిమా విడుదల కానుంది.
