పొలిమేర 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. కత్తి పట్టిన యోధుడిగా అర్జున్ సర్జా!

పొలిమేర 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. కత్తి పట్టిన యోధుడిగా అర్జున్ సర్జా!

మా ఊరి పొలిమేర,  పొలిమేర 2  చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగంగా ‘పొలిమేర 3’ తెరకెక్కుతోంది.  తాజాగా ఈ సినిమాలో అర్జున్ సర్జా పోషిస్తున్న ‘విరావి’ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌‌‌‌ను  విడుదల చేశారు మేకర్స్.   ఇందులో  అర్జున్  యోధుడి వేషధారణలో, చేతిలో కత్తితో పవర్‌‌‌‌ఫుల్ లుక్‌‌‌‌లో కనిపించి ఆకట్టుకున్నారు.  ఆలయ నేపథ్యం, అమావాస్య వాతావరణం, ఆధ్యాత్మికత, అతీంద్రియ అంశాలతో గ్లింప్స్ ఆసక్తిని పెంచింది.

అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సత్యం రాజేశ్ మరోసారి కొమరయ్యగా నటిస్తున్నాడు.  కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  వంశీ నందిపాటి, భరత్ నారంగ్ కలిసి  నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.