అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా –సైరంగ్ ఎక్స్‌ప్రెస్‌

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన  కోల్‌కతా –సైరంగ్ ఎక్స్‌ప్రెస్‌

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.  బుధవారం ఉదయం ( నవంబర్ 11) కోల్ కతా సైరంగ్  ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.  కోల్ కతా నుంచి మిజోరాం వెళ్తుండగా అసోంలోని దిగారు రైల్వే స్టేషన్ సమీపంలో  రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది.  రైలు ఇంజిన్ తోపాటు ఐదు బోగీ లు పూర్తిగా పట్టాలు తప్పి పక్కకు దూసుకుపోయాయి. ఈశాన్య రైల్వే ప్రకారం.. పలువురు ప్రయాణికులను స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మిగతా ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్య స్థానాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు , రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.