డిగ్రీ ఉంటే చాలు ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.15 వేల స్టైపెండ్

 డిగ్రీ ఉంటే చాలు ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.15 వేల స్టైపెండ్

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ 2026–-27 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ రాష్ట్రాల్లోని బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న  అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ నవంబర్ 5న ప్రారంభం కాగా, నవంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 1500. ఆంధ్రప్రదేశ్ 85, తెలంగాణ రాష్ట్ర పరిధిలో 46 ఖాళీలు ఉన్నాయి. 
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
2022, ఏప్రిల్ 1 నుంచి 2026, నవంబర్ 1 మధ్యలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 2026, నవంబర్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

స్టైపెండ్: శిక్షణా కాలంలో మెట్రో/ పట్టణ ప్రాంత బ్రాంచ్‌ల్లో నియమితులైన వారికి నెలవారీ స్టైపెండ్ కింద రూ. 15,000, అలాగే గ్రామీణ/ సెమీ -అర్బన్ ప్రాంతాల్లో రూ. 12,300 చెల్లించనున్నారు.

అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 5.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు రూ.175 చెల్లించాలి. 
లాస్ట్ డేట్: నవంబర్ 25.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్indianbank.bank.inను సందర్శించండి. 

రాత పరీక్ష

ఆన్​లైన్ విధానంలో జరిగే ఎగ్జామ్​లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం100 ప్రశ్నలు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. రీజనింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 15 ప్రశ్నలు15 మార్కులకు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 10 ప్రశ్నలు - 10 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు- 25 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం) నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 

లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్

రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్థానిక భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో అభ్యర్థులు నిర్దేశిత ప్రమాణాలను సాధించాల్సి ఉంటుంది. 8వ, 10వ లేదా 12వ తరగతిలో సంబంధిత స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే వారికి లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. అభ్యర్థికి తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం/ ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాష మాట్లాడటం, చదవగలగడం, రాయగలగడం వచ్చా లేదా అని పరిశీలించడం ఈ టెస్ట్ ప్రధాన ఉద్దేశం.