విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్..మార్గదర్శకాలకు సర్కారు నిర్ణయం

విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్..మార్గదర్శకాలకు సర్కారు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: విద్య, క్రీడా సంబంధిత కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాల్సిన విద్యాసంస్థల ప్రాంగణాలను సినిమా ప్రమోషన్లకు, ఇతర వాణిజ్య ఈవెంట్లకు వేదికగా మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం  సీరియస్‌‌‌‌ అయింది. క్యాంపస్‌‌‌‌ల పవిత్రతను కాపాడటంతోపాటు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, త్వరలోనే కఠిన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తీసుకురావాలని నిర్ణయించింది. 

ఈ మేరకు విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేస్తూ నిబంధనావళిని సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన నిబంధనల ప్రకారం.. ఇకపై విద్యాసంస్థల్లో విద్య, క్రీడా రంగానికి సంబంధించి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే ముందస్తు అనుమతులు తప్పనిసరి కానున్నాయి.