కరీంనగర్: లైఫ్ సర్టిఫికెట్ పేరుతో సైబర్ మోసం..బాధితుడి ఖాతా నుంచి రూ.10.80 లక్షలు మాయం

కరీంనగర్: లైఫ్ సర్టిఫికెట్ పేరుతో సైబర్ మోసం..బాధితుడి ఖాతా నుంచి రూ.10.80 లక్షలు మాయం

కరీంనగర్, వెలుగు: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పేరుతో ఓ వ్యక్తి ఖాతా నుంచి సైబర్​ నేరగాళ్లు  రూ.10.80 లక్షలు మాయం చేసిన ఘటన కరీంనగర్​లో ఆలయస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ కు చెందిన మురళీధర్ రావుకు ఈ నెల 1న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి డిజిటల్​ లైఫ్​ సర్టిఫికెట్​ పేరుతో బ్యాంకు అకౌంట్ వివరాలు సేకరించారు. 

5వ తేదీ అర్ధరాత్రి 11 గంటల నుంచి 12.30 గంటల మధ్య ఆరు సార్లు మురళీధర్​రావుకు చెందిన యూనియన్ బ్యాంక్ అకౌంట్ లో నుంచి రూ.10.80 లక్షలను ముంబై, కోల్ కతాలలోని ఇతర అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. ఫోన్ మెస్సేజ్ లను చూసుకున్న బాధితుడు బ్యాంకుకు సంప్రదించగా, అక్కడి అధికారుల సూచన మేరకు సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేశాడు.