జ్యోతి నగర్,వెలుగు: జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న 2026-– 27 నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్-–17 బాలికల క్రికెట్ ఛాంపియన్‌షిప్‌నకు ఎంపికైన పెద్దపల్లికి చెందిన క్రీడాకారిణి స్ఫూర్తిని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభినందించారు.
ఈ సందర్భంగా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని స్ఫూర్తి నివాసానికి వెళ్లిన ఎంపీ, ఆమెతో పాటు కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిభ, పట్టుదలతో ఈ అవకాశాన్ని దక్కించుకున్న స్ఫూర్తి జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
