- రూ.4 లక్షల నగదు కూడా..
- మేడ్చల్‌లో ఘటన
మేడ్చల్ వెలుగు : మేడ్చల్ పోలీస్ స్టేషన్ముందున్న శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌లో దొంగతనం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దుకాణం వెనుక గది గోడకు కన్నం వేసిన దొంగలు 25 తులాల బంగారం, 8.5 కిలోల వెండి, రూ.4 లక్షల నగదు ఎత్తుకుపోయారు. మంగళవారం ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన ఓనర్శేషమాల్ చౌదరి కొడుకు చోరీ జరిగినట్లు గుర్తించారు.
రెండేండ్ల కింద మధ్యాహ్నం వేళ కత్తి పట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి బెదిరించి వెండి సామాను ఎత్తుకుపోయాడు. ఇప్పటి వరకు ఆ నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. మళ్లీ అదే షాపులో అది కూడా పీఎస్ఎదురుగా ఉండే దుకాణంలోనే ఏకంగా 25 తులాల బంగారం, వెండి , నగదు ఎత్తుకుపోయారు. ఘటనపై మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తున్నామన్నారు.
