న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు.. రిషబ్ పంత్ రెడీ !

న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు.. రిషబ్  పంత్ రెడీ !

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌కు ముందు టీమిండియాకు గుడ్‌‌‌‌‌‌‌‌న్యూస్‌‌‌‌‌‌‌‌. పక్కటెముకల గాయం నుంచి కోలుకుంటున్న వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌.. బీసీసీఐ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌ (సీవోఈ) నుంచి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ పొందే అవకాశం కనిపిస్తోంది. దాంతో పంత్‌‌‌‌‌‌‌‌ గురువారం న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ బయలుదేరనున్నాడు. రెస్టాఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా తరపున ఇరానీ కప్‌‌‌‌‌‌‌‌లో ఆడుతున్నప్పుడు పంత్‌‌‌‌‌‌‌‌కు ఈ గాయమైంది. రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను నిరూపించుకునేందుకు అతన్ని ఇండియా–ఎ జట్టులో చేర్చారు. 

అయితే అప్పట్లో పంత్‌‌‌‌‌‌‌‌కు సీవోఈ నుంచి అవసరమైన ఆర్‌‌‌‌‌‌‌‌టీపీ (రిటర్న్‌‌‌‌‌‌‌‌ టు ప్లే) సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ లభించలేదు. ప్రస్తుతం పంత్‌‌‌‌‌‌‌‌ పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘మంగళ, బుధవారాల్లో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ సిమ్యులేషన్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియలో పాల్గొంటాడు. ఈ రెండు రౌండ్లు విజయవంతంగా పూర్తయితే పంత్‌‌‌‌‌‌‌‌ కివీస్‌‌‌‌‌‌‌‌కు బయలుదేరతాడు’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత టీమిండియాలో.. కివీస్‌‌‌‌‌‌‌‌లో టెస్ట్ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడిన అనుభవం ఉన్న అతికొద్ది మంది ప్లేయర్లలో పంత్‌‌‌‌‌‌‌‌ ఒకడు. 2020లో అక్కడ టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడాడు.