‘దుమ్ముగూడెం’ ఎత్తు పెంపు..ఇసుక బస్తాలతో ఏర్పాటు

‘దుమ్ముగూడెం’ ఎత్తు పెంపు..ఇసుక బస్తాలతో ఏర్పాటు

ఎల్ నినో ఎఫెక్ట్ తో తాగునీటికి ఇబ్బందులు రాకుండా వృథాగా పోతున్న గోదావరి జలాలను నిల్వ చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఆఫీసర్లు పనులు వేగవంతం చేశారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద దుమ్ముగూడెం ఆనకట్టపై అదనంగా ఒక టీఎంసీ నీటి నిల్వ కోసం ఇసుక బస్తాలతో తాత్కాలిక ఆనకట్ట ఏర్పాటు కార్యరూపం దాల్చింది. ఇప్పటికే మూడు వరుసలుగా ఇసుక బస్తాలను ఆనకట్టపై పేర్చగా, మరో 15 రోజుల్లో ఏడు వరసలు పేర్చి నీటిని నిల్వ చేయనున్నారు. - మణుగూరు, వెలుగు