పంజాగుట్ట, వెలుగు : సాహిత్య ప్రియులను అలరించేందుకు నిర్వహించే ఛాయా సాహిత్యోత్సవాన్ని విజయవంతం చేయాలని సీనియర్ఎడిటర్, ఛాయా లిటరేచర్ఫెస్టివల్డైరెక్టర్ కే.శ్రీనివాస్ కోరారు. మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బ్రోచర్ఆవిష్కరించిన ఆయన వివరాలను వెల్లడించారు. ఈ నెల 14,15న జూబ్లీహిల్స్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి ఆడిటోరియంలో తెలుగు సాహిత్య కేంద్రంగా భారతీయ,అంతర్జాతీయ సాహిత్యం పై ఛాయా సాహిత్యోత్సవం రెండో వార్షికోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు.
గత ఏడాది నిర్వహించిన సాహిత్యోత్సవానికి 2000 మంది వరకు సాహితి ప్రియులు హాజరయ్యారని, ఈసారి 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్య అతిథులుగా తెలుగు రచయితలు కే శివారెడ్డి , నందిని సిధారెడ్డి, సత్యవతి, మహమ్మద్ షబ్బీర్, దేశపతి శ్రీనివాస్, వినోదిని, అల్లం నారాయణ, గంట చక్రపాణి లతోపాటు కన్నడ రచయితలు హాజరుకానునట్టు తెలిపారు. అమెరికన్ రచయిత ప్రొఫెసర్ పీటర్ కాన్స్టైన్, ఛాయా రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ మోహన్ బాబు, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ పాల్గొన్నారు.
