కనుల పండువగా కురుమూర్తి పెండ్లి..ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

కనుల పండువగా కురుమూర్తి పెండ్లి..ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

చిన్న చింతకుంట, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లాలో చిన్నచింత కుంట మండలం అమ్మాపూర్​లో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 

ఇందులో భాగంగా తొలిరోజు స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. కల్యాణోత్సవంలో ఆలయ చైర్మన్ బత్తుల బాలరాజ్, ఈవో మదనేశ్వర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.