హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి రావాలంటే బీబీనగర్ ఎయిమ్స్కు వీలైనన్ని ఎక్కువ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేతవినోద్కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి మంగళవారం లేఖ రాశారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఎయిమ్స్కు బస్సులు నడపాలన్నారు.
అదే విధంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ జంక్షన్ నుంచి బీబీ నగర్ఎయిమ్స్కు అరగంటకోసారి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఔట్ పేషెంట్ సమయాలకు అనుగుణంగా బస్సు వేళలను సమన్వయం చేయాలని కోరారు.
